: తప్పులు చేసే అధికారులపై కఠిన చర్యలే!: కార్యదర్శులకు మోదీ ఆదేశం
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మంగళవారంతో 20 నెలల పాలనను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నిన్న కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో పాటు మంత్రులతోనూ వేర్వేరుగా భేటీ అయ్యారు. కార్యదర్శులతో భేటీ సందర్భంగా మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పనితీరును మెరుగుపరచుకునేందుకు ఇష్టపడని వారిపైనా, వరుసగా తప్పులు చేసే అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగాల నుంచి తొలగించడమే కాక పెన్షన్ కూడా రాకుండా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలతో మమేకమవడమే కాక, గ్రీవెన్స్ లో మరింత వేగంగా పనిచేయాలని సూచించారు. తత్ఫలితంగా పరిపాలనను మెరుగుపరచాలన్నారు.