: దేవుడా.. ఆ పాట నా కూతురు పాడకూడదు: అమెరికన్ సింగర్ లియాన్


తాను రాసిన పాటలు, పాడిన పాటలు తిరిగి తన కూతురు పాడుతుంటే ఎవరైనా సరే ఎంతో సంతోషిస్తారు. కానీ, ఈ తండ్రి మాత్రం తన ఆల్బంలోని ఆ పాటను తన మూడేళ్ల కూతురు పాడకూడదని కోరుకుంటున్నాడు. ఎవరా తండ్రీ? ఏమిటా విషయం? అంటే..అమెరికన్ సింగర్ ఏజే మెక్ లియాన్ ఆల్బంలోని ‘సెక్స్’ అనే పాటను కూతురు అవా తరచుగా పాడుతోందట. ‘అవాకు సంగీతమంటే ఇష్టం. ఆడుతుంది, పాడుతుంది. ఆ పాటలోని పదాలకు అర్థం తెలియకపోయినా పాడుతుంటుంది. నా కూతురి నోటి వెంట ఆ పాట వింటుంటే నాకు ఇబ్బందికరంగా ఉంటోంది. దేవుడా.. నా కూతురు ఆ పాట పాడకుండా చూడు అని అనాలని పిస్తోంది’ అని ‘బ్యాక్ స్ట్రీట్ బాయ్స్’తో ప్రజాదరణ పొందిన లియాన్ తన గోడు వెళ్లబుచ్చాడు.

  • Loading...

More Telugu News