: విశాఖలో పట్టుబడ్డ ఐదుగురు ఉగ్రవాదులు కాదు... ఇరాన్ టూరిస్టులుగా తేల్చిన పోలీసులు


విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన ఐదుగురు విదేశీయులు ఉగ్రవాదులు కాదని తేలిపోయింది. ఢిల్లీ రిజిస్ట్రేషన్ తో ఉన్న ఓ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు సహా ఐదుగురు విదేశీయుల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నర్సీపట్నం డీఎస్పీ ఆధ్వర్యంలో జరిగిన విచారణలో మరిన్ని అనుమానాలు రేకెత్తడంతో వారిని నిన్న రాత్రే విశాఖకు తరలించిన పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. అయితే ఉగ్రవాద కోణంలో సదరు వ్యక్తుల వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. అంతేకాక కేవలం టూరిస్టులుగానే వారు భారత్ లో అడుగుపెట్టారని నిర్ధారించుకున్న పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖ జిల్లాలోకి ఎంటరయ్యే ముందు ఒడిశాలోని ఓ హోటల్ లో బస చేసేందుకు వెళ్లిన సదరు టూరిస్టులు తమ పాస్ పోర్టులు చూపించేందుకు నిరాకరించడమే కాక, అక్కడి నుంచి పరారు కావడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు.

  • Loading...

More Telugu News