: స్టెప్పులేసిన చంద్రబాబు... నంది నాటకోత్సవ అవార్డుల్లో సందడి చేసిన ఏపీ సీఎం
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న తిరుపతిలో సుడిగాలి పర్యటన చేశారు. నిన్న ఉదయమే విజయవాడ నుంచి తిరుపతి చేరుకున్న చంద్రబాబు పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీబిజీగా గడిపారు. చివరగా నగరంలోని మహతి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన నంది నాటకోత్సవ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అక్కడి కళాకారులతో కలిసి చంద్రబాబు కాలు కదిపారు. మహిళా కళాకారులతో కలిసి స్టెప్పులేసిన చంద్రబాబు ఆ కార్యక్రమానికి హాజరైన వారికి కనువిందు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళలనే కాక కళాకారులకు కూడా తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తుందని ప్రకటించారు.