: ఈ నాలుగు పత్రాలుంటే వారంలోనే పాస్ పోర్టు... ట్విట్టర్ లో ప్రకటించిన సుష్మా


పాస్ పోర్టు కోసం తొలిసారిగా దరఖాస్తు చేస్తున్నారా? అయితే కేవలం నాలుగంటే నాలుగు పత్రాలు దరఖాస్తుకు జతచేస్తే... వారంలోనే పాస్ పోర్టు మీ మన చేతికి వచ్చేస్తుంది. ఈ మేరకు పాస్ పోర్టు జారీలో నెలకు పైగా జరుగుతున్న జాప్యానికి చెక్ పెట్టనున్నట్లు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ నిన్న ట్విట్టర్ వేదికగా దేశ ప్రజలకు కీలక సందేశం పంపారు. పాస్ పోర్టు దరఖాస్తుకు జత చేయాల్సిన పత్రాలేమిటంటే... 1.ఆధార్ కార్డు, 2.ఓటరు గుర్తింపు కార్డు, 3.పాన్ కార్డు, 4.వ్యక్తిగత వివరాలను ధ్రువీకరించే అఫిడవిట్. ఈ నాలుగు పత్రాల నకళ్లను దరఖాస్తుకు జత చేస్తే వారం రోజుల్లోనే పాస్ పోర్టు మన చేతికి అందుతుంది. ప్రస్తుతం పాస్ పోర్టు దరఖాస్తుల జారీకి సంబంధించి జరుగుతున్న పోలీసు వెరిఫికేషన్ సమయాన్నంతా తినేస్తోంది. తక్కువలో తక్కువగా పాస్ పోర్టు జారీకి నెల సమయం పడుతోంది. తాజా నిర్ణయంతో వారంలోనే పాస్ పోర్టును అందుకోవచ్చు.

  • Loading...

More Telugu News