: అవినీతిలో భారత్ కు పాస్ మార్కులు... అత్యంత తక్కువ కలిగిన దేశంగా డెన్నార్క్
2015లో వివిధ దేశాల్లోని అవినీతి స్థాయిపై ట్రాన్స్ పరెన్స్ ఇంటర్నేషనల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ విడుదల చేసింది. ఆయా దేశాల్లో ఉన్న అవినీతి స్థాయి ప్రకారం మార్కులు వేసింది. ఇందులో కొంచెం కూడా అవినీతి లేని దేశానికి 100 పాయింట్లు, పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన దేశాలకు సున్నా పాయింట్లు ఇచ్చారు. అయితే, ఈ జాబితాలో ఏ ఒక్క దేశం కూడా 100 పాయింట్లను దక్కించుకోలేకపోవడం గమనార్హం. దాంతో ప్రపంచవ్యాప్తంగా అవినీతి లేని దేశం ఒక్కటి కూడా లేదని రుజువైంది. ఈ క్రమంలో 91 పాయింట్లతో ప్రపంచంలోనే అత్యంత తక్కువ అవినీతి కలిగిన దేశంగా డెన్నార్క్ మొదటి స్థానంలో నిలిచింది. 38 పాయింట్లతో ఈ జాబితాలో భారత్ 76వ స్థానంలో ఉంది. విషయమేంటంటే, జాబితాలో భారత్ పాస్ మార్కులను సంపాదించుకున్నా 2014, 2015 సంవత్సరాల్లో భారత దేశంలోని అవినీతిలో ఎలాంటి మార్పు కనిపించలేదని నివేదికలో తెలిపారు. కానీ రష్యా, చైనాలతో పోల్చుకుంటే మనదేశ పరిస్థితి మెరుగ్గా ఉందని పేర్కొంది.