: కీసరలో కానిస్టేబుల్ పై తిరగబడిన యువతి అరెస్టు


రంగారెడ్డి జిల్లా కీసరలో రాంగ్ రూట్ లో వచ్చి ట్రాఫిక్ కానిస్టేబుల్ పై తిరగబడ్డ హర్షిత అనే యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హర్షిత లయోలా కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్టు పోలీసులు గుర్తించారు. రాంగ్ రూట్ లో వచ్చిన హర్షిత ఫోటో తీసిన కానిస్టేబుల్ పై తిరగబడింది. దీంతో కానిస్టేబుల్ పోలీస్ భాషలో మందలించారు. దీంతో ఆగ్రహించిన యువతి అదే భాషలో సమాధానం చెబుతూ, అతని చొక్కాపట్టుకుంది. దీంతో స్థానికులు కల్పించుకుని యువతిని మందలించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో పోలీసులు సదరు యువతని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News