: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కండిషనల్ బెయిల్


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి తిరుపతి కోర్టు ఇవాళ కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. చిత్తూరు జిల్లా తిరుపతి విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా అధికారిపై దాడి చేసిన కేసులో మిథున్ ను కొన్ని రోజుల కిందట చెన్నై ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిపిన కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. కాగా మిథున్ నెల్లూరు సబ్ జైలులో ఉన్న సమయంలో జగన్ స్వయంగా వెళ్లి పరామర్శించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News