: మహిళలు ఉన్నచోట అవినీతి తక్కువ: కవిత


మహిళలు ఉన్నచోట అవినీతి తక్కువగా ఉంటుందని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. హైదరాబాదులో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 50 సీట్లను మహిళలకు కేటాయించిందని అన్నారు. మహిళలు తక్కువ అవినీతికి పాల్పడుతారని చెబుతూ నవ్వేశారు. అందుకే గ్రేటర్ ఎన్నికల్లో తాము మహిళలకు పెద్దపీట వేశామని అన్నారు. గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే విజయమని ఆమె స్పష్టం చేశారు. మేయర్ పదవిని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చేపడతారని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News