: మూడేళ్ల పాపకు మూత్రపిండ మార్పిడి ... ఎన్ఆర్ఐ వైద్యుడి ఘనత!
త్రీడీ ముద్రణ సాయంతో మూడేళ్ల బాలికకు మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన ఘనత బ్రిటన్ లోని ఎన్ఆర్ఐ వైద్యుడికి దక్కింది. భారత సంతతి వైద్యుడు పంకజ్ చండల్ నేతృత్వంలో గయ్స్ అండ్ సెయింట్ థామస్ ఆసుపత్రి వైద్య బృందం లూసీ అనే చిన్నారికి ఈ శస్త్రచికిత్సను చేశారు. లూసీ నెలల వయస్సులో ఉన్నప్పుడే కిడ్నీ సంబంధిత సమస్యలు తలెత్తాయి. చాలా కాలం పాటు లూసీకి డయాలసిస్ ద్వారి చికిత్స అందించారు. ఈ క్రమంలో చిన్నారి తండ్రి నుంచి సేకరించిన మూత్రపిండాన్ని త్రీ డీ ముద్రణ సాయంతో లూసీకి అమర్చినట్లు విషయాన్ని వైద్యులు తెలిపారు.