: ఏపీ సీఎంవోకు సందర్శకుల వెల్లువ... పలువురికి సీఎం నిధి నుంచి సాయం


విజయవాడలోని ఏపీ సీఎం కార్యాలయానికి ఇవాళ భారీగా సందర్శకులు వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకుని వారి సమస్యలు వివరించి వినతిపత్రాలు సమర్పించారు. ఇందుకు తక్షణమే స్పందించిన బాబు, వారికి ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం లక్ష్మీపురానికి చెందిన బ్రెయిన్ ఫీవర్ పేషెంట్ మహేశ్వరరెడ్డికి రూ.3 లక్షలు, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం మారువాడకు చెందిన కేన్సర్ రోగి దొరస్వామి అనే యువకుడికి రూ.2 లక్షల ఆర్ధిక సాయం మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కడప జిల్లాకు చెందిన పేద మహిళ బి.లక్ష్మీదేవికి రూ.20వేలు, ప్రకాశం జిల్లాకు చెందిన వెలుగొండయ్యకు రూ.30వేలు, మున్నీసా అనే బాలిక శస్త్రచికిత్సకు రూ.25వేలు ఆర్థిక సాయం అందించారు.

  • Loading...

More Telugu News