: వీసీ గో బ్యాక్...హెచ్ సీయూ విద్యార్థుల నిరసన నినాదాలు


'వీసీ గోబ్యాక్' నినాదాలతో హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ హోరెత్తింది. రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హెచ్ సీయూ విద్యార్థులు నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో ఇన్ఛార్జ్ వీసీ శ్రీవాత్సవ విద్యార్థులతో మాట్లాడేందుకు నిరాహారదీక్షా శిబిరానికి చేరుకున్నారు. దీంతో విద్యార్థులు వీసీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. న్యాయం చేసిన తరువాత తమతో మాట్లాడాలని వీసీకి విద్యార్థులు సూచించారు. గతంలో దళిత విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన వీసీ ఎలా న్యాయం చేయగలరని వారు ప్రశ్నించారు. విచారణ కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్న ఇన్ఛార్జీ వీసీ విద్యార్థులతో ఏం మాట్లాడుతారని వారు నిలదీశారు. తప్పు చేసిన వారే విచారణ కమిటీలో కొనసాగితే విద్యార్థులకు ఎలా న్యాయం జరుగుతుందని వారు అడిగారు.

  • Loading...

More Telugu News