: బాహుబలి కాలకేయుడ్ని ఓడించా: తాగుబోతు రమేష్
బాహుబలి కాలకేయుడ్ని ఓడించానని సినీ నటుడు తాగుబోతు రమేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. సుమంత్ అశ్విన్ ప్రధాన పాత్రలో 'రైట్ రైట్' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ లో కాస్త విరామం దొరకడంతో బాహుబలిలో కాలకేయుడు పాత్రధారి ప్రభాకర్ తో హాస్యనటుడు తాగుబోతు రమేష్ ఓ పట్టుపట్టారు. అశ్విన్ చూస్తుండగా జరిగిన ఈ బల ప్రదర్శనలో రమేష్ ఓ చిత్రమైన ఎక్స్ ప్రెషన్ ఇవ్వడంతో ప్రభాకర్ నవ్వేశాడు. దీంతో రమేష్ తన చేతితో ప్రభాకర్ చేతిని వంచేసి విజయం సాధించాడు. ఈ సందర్భంగా తీసిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టిన తాగుబోతు రమేష్, హీరో సాక్షిగా ప్రభాకర్ ను ఓడించానని క్యాప్షన్ ఇచ్చాడు. దీనికి వీరి అభిమానుల నుంచి ఆదరణ లభిస్తొంది.