: 'వర్క్ ఫ్రమ్ హోమ్'కు చాన్స్ ఇస్తున్న టాప్ టెన్ సంస్థలు
కార్యాలయాల నుంచే ఉద్యోగం చేయడం కాకుండా ప్రస్తుత కాలంలో చాలా సంస్థలు ఇంటి నుంచి కూడా ఉద్యోగం చేసేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. తాజాగా 100 ఉత్తమ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోంకు అవకాశం ఇస్తున్నాయని ఉద్యోగావకాశాలు కల్పించే ఫెక్స్ జాబ్స్ సంస్థ జాబితా వెల్లడించింది. ఇందులో యునైటెడ్ హెల్త్ గ్రూప్ మొదటి స్థానంలో నిలవగా, డెల్ రెండు, ఐబీఎమ్ మూడో స్థానంలో ఉన్నాయి. ఆ వంద సంస్థల్లో తొలి స్థానంలో ఉన్న 10 సంస్థలు పేర్లు తెలిపింది. 1. యునైటెడ్ హెల్త్ గ్రూప్ 2. డెల్ 3. ఐబీఎమ్ 4. హ్యుమనా 5. ఎత్నా 6. కెల్లీ సర్వీసెస్ 7. సేల్స్ ఫోర్స్ 8. పారెక్సల్ 9. సైబర్ కోడర్స్ 10. వీఎమ్ఆర్. ఈ సంస్థల్లో ఉద్యోగాల్లో చేరితే ఇంటి నుంచే ఉద్యోగం చేయవచ్చని ఫెక్స్ జాబ్స్ తెలిపింది.