: నాడు అలా... నేడు ఇలా... మాట మార్చిన అనుపమ్ ఖేర్!


బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మాట మార్చారు. గతంలో పద్మ అవార్డులను ప్రకటించినప్పుడు వీటిల్లో వాస్తవికత ఎంతమాత్రమూ లేదని, సినిమా అవార్డులైనా, జాతీయ అవార్డులైనా, పద్మ అవార్డులైనా అంతేనని ఎద్దేవా చేసిన అనుపమ్, ఈ సంవత్సరం తనకు పద్మభూషణ్ ప్రకటితమైన తరువాత మాట మార్చారు. ఇండియన్ గవర్నమెంట్ తనను సత్కరిస్తున్నందుకు గర్వంగా ఉందని ఆయన అదే ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెట్టారు. ఇంకేముంది, నెటిజన్లకు ఒళ్లు మండిపోయింది. ఆయన పాత ట్వీట్ ను వెతికి పట్టుకొచ్చి మరీ విమర్శలు ప్రారంభించారు. ఈ విమర్శలపై అనుపమ్ ఖేర్ స్పందిస్తూ, తనకు అవార్డు రావడం కొంతమందికి కడుపు మంట తెప్పించిందని అనడం గమనార్హం.

  • Loading...

More Telugu News