: రేపు ఎన్నికలు జరిగితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఎన్ని సీట్లు గెలుస్తుందంటే..!


నరేంద్ర మోదీ ప్రధానిగా ఎన్నికై దాదాపు 20 నెలలు అవుతోంది. ఈ మధ్యకాలంలో ఆయన ప్రభుత్వ పనితీరు ఎలాగున్నప్పటికీ, ప్రజలు మాత్రం ఆయనవైపే ఉన్నారని ఓ స్వతంత్ర సర్వే చెబుతోంది. మోదీ సర్కారుపై ప్రజల అభిప్రాయం 'ఎబౌ యావరేజ్'గానే ఉందని, అయినప్పటికీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్)కు 301 సీట్లు వస్తాయని 'ఏబీపీ న్యూస్, నీల్సన్' సంయుక్త సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా తాము సర్వే నిర్వహించగా, ఇందులో పాల్గొన్న 36 శాతం మంది మోదీ పాలన 'చాలా బాగుంది', లేదా 'బాగుంది' అని సమాధానం ఇచ్చారని తెలిపింది. ఎన్డీయేకు 38 శాతం ఓట్లతో 301 సీట్లు రావచ్చని తెలిపింది. కాగా, మే 2014లో ఎన్డీయే సాధించిన 339 సీట్లతో పోలిస్తే ఇది 38 సీట్లు తక్కువ. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏకు 28 శాతం ఓట్లు పడవచ్చని, ఆ పార్టీ సీట్ల సంఖ్య 62 నుంచి 108కి పెరగవచ్చని అంచనా వేసింది. మిగతా అన్ని ప్రాంతీయ పార్టీలకన్నా అధికంగా ఆమ్ ఆద్మీ పార్టీకి 4 శాతం ఓట్లు దక్కవచ్చని వెల్లడించింది.

  • Loading...

More Telugu News