: 18 లక్షల మందికి వ్యక్తిగత గ్రీటింగ్స్ పంపిన మోదీ


"మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీవంటి లక్షలాది మంది పోలీసుల ధైర్య సాహసాలకు, సేవలకు నేను సెల్యూట్ చేస్తున్నా"... దేశంలో శాంతి భద్రతల పరిరక్షణకు, సరిహద్దుల్లో దేశ రక్షణకు శ్రమిస్తున్న దాదాపు 18 లక్షల మంది పోలీసులు, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సైన్యానికి మోదీ పంపిన వ్యక్తిగత మెసేజ్ ఇది. సెండర్ లింక్ 'డీజడ్-పీఎంమోదీ' పేరిట ఈ మెసేజ్ దేశంలోని అందరు పోలీసులకూ వచ్చింది. డైరెక్టర్ జనరల్ ర్యాంకు అధికారి నుంచి సాధారణ కానిస్టేబుల్ వరకూ ఈ మెసేజ్ ని అందుకున్నారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇండియాలోని పోలీసులకు ఇలా ప్రధాని నుంచి సందేశం రావడం ఇదే తొలిసారి.

  • Loading...

More Telugu News