: ఓ వైపు నాగార్జున, మరోవైపు మహేశ్... తమన్నా సరదా!


స్టార్ హీరోలను చూస్తే, ఎవరికైనా వారి దగ్గరకు వెళ్లాలని, మాట్లాడాలని, వీలైతే కలసి ఫోటో దిగాలని అనిపిస్తుంది. వారే ఇక మహేశ్ బాబో, నాగార్జునో అయితే, దగ్గరికెళ్లేందుకు పరుగులు పెడతాం. హీరోయిన్ తమన్నా కాసేపు తాను కూడా వారి అభిమానిని అనుకుందో, ఏమో.... వారి దగ్గరకి వెళ్లి సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడింది. ఓ వైపు నాగ్ తో, మరోవైపు మహేశ్ తో సెల్ఫీలు దిగి సామాజిక మాధ్యమాల్లో సంబరంగా పెట్టేసుకుంది. ఈ ఘటన ఐఫా అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా జరిగింది. కాగా, ఐఫా అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ నటుడిగా మహేశ్ బాబు అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News