: రెండోసారి కొండెక్కిన అమరావతి అఖండ సంకల్ప జ్యోతి!


నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కనీసం 50 శాతం వరకూ పూర్తయ్యే వరకూ అనునిత్యమూ వెలుగుతూ ఉండాలని సంకల్పించిన అఖండ జ్యోతి మరోసారి కొండెక్కడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత సంవత్సరం అమరావతి శంకుస్థాపన సందర్భంగా, అమరేశ్వరాలయంలో వెలిగించిన జ్యోతి అందరికీ స్ఫూర్తిని నింపగా, ఆపై దాన్ని అఖండ జ్యోతిగా ఉంచుతామని, ఈ సంవత్సరం శివరాత్రి తరువాత కోటప్పకొండ త్రికోటేశ్వరుని సన్నిధిలో జ్యోతిని ఉంచుతామని ఏపీ సర్కారు గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. నిరంతరమూ వెలగాల్సిన జ్యోతి అమరేశ్వరాలయం సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆగిపోయింది. ఇకనైనా సెంటిమెంట్ తో కూడిన జ్యోతి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు.

  • Loading...

More Telugu News