: హైదరాబాద్ లో మరో ఐఎస్ సానుభూతిపరుడి అరెస్ట్!
హైదరాబాద్ లో ఐఎస్ఐఎస్ కు చెందిన మరో సానుభూతిపరుడిని ఈ రోజు అరెస్ట్ చేశారు. ఇంటెలిజెన్స్ అధికారులు అతన్ని విచారిస్తున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులకు రేపు అతన్ని అప్పగించనున్నట్లు తెలుస్తోంది. కాగా, గణతంత్ర దినోత్సవం నాడు దేశ వ్యాప్తంగా కుట్రలకు పాల్పడేందుకు ఐఎస్ ఉగ్రవాదులు పథక రచన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కుట్రను ఛేదించిన ఎన్ఐఏ, ఇతర నిఘా వర్గాలు 14 మంది ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేశారు. ఇప్పటికే హైదరాబాద్ లో నలుగురు ఐఎస్ సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు.