: మంచి క్రికెటర్ కు వీడ్కోలు కూడా చెప్పలేదు: బ్రియాన్ లారా!
ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన వెస్టిండీస్ క్రికెటర్ చందర్ పాల్ కు వీడ్కోలు చెప్పకపోవడం తనకు చాలా బాధ కల్గించిందని లెజెండరీ క్రికెటర్ బ్రియాన్ లారా ఆవేదన వ్యక్తం చేశాడు. వెస్టిండీస్ గొప్ప క్రికెటర్లలో చందర్ పాల్ ఒకరని.. మంచి క్రికెటర్ అని లారా అన్నాడు. వెస్టిండీస్ టెస్టు జట్టు నుంచి అతన్ని తొలగించడమే కాకుండా, వీడ్కోలు చెప్పకపోవడం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని అన్నాడు. చందర్ పాల్ కు కనీసం వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశం రాకపోవడం బాధాకరమన్నాడు. వీడ్కోలు చెప్పే క్రమంలో చందర్ పాల్ కు ఒక అవకాశం కల్పించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో ఆయన కూడా ఆవేదన చెంది ఉంటాడని బ్రియాన్ లారా అన్నాడు.