: చిరంజీవి భలే వంట చేస్తారు తెలుసా?: వివేక్ ఓబెరాయ్
మెగాస్టార్ చిరంజీవి గారు భలే వంట చేస్తారు తెలుసా? అని ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ అన్నాడు. చిరంజీవి మెగాస్టార్ మాత్రమే కాదని, ఆయన మనసు కూడా మెగాస్టారేనని అన్నాడు. తాను హైదరాబాదు వచ్చినప్పుడు ఆయన స్వయంగా ఇంటికి ఆహ్వానించి, స్వయంగా వంట చేసి, భోజనం పెట్టారని వివేక్ ఒబెరాయ్ గుర్తు చేసుకున్నాడు. హైదరాబాదు తన పుట్టిల్లని చెప్పాడు. తన తండ్రికి, తనకు ఇక్కడ చాలా మంది స్నేహితులు ఉన్నారని తెలిపాడు. సినీ పరిశ్రమలో మహేశ్ బాబు, రాంచరణ్, రానా తదితరులు తనకు మంచి స్నేహితులని వివేక్ ఒబెరాయ్ వెల్లడించాడు. తెలుగు అభిమానులు చూపించే ఆదరణ మర్చిపోలేనని ఆయన తెలిపాడు.