: పోలీసులపై రాళ్లు రువ్విన ఎర్ర చందనం కూలీలు!
పోలీసులపై ఎర్ర చందనం కూలీలు రాళ్లు రువ్వడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపిన సంఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో జరిగింది. శ్రీవారి మెట్టు సమీపంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా సుమారు 20 మంది ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. తమను పట్టుకుంటామనే భయంతో వారు రాళ్ల దాడికి పాల్పడ్డారని, దీంతో గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు చెప్పారు. ఎర్రచందనం కూలీలు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 18 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు పేర్కొన్నారు.