: లండన్ లో ముస్లిం యువతి వినూత్న ప్రయోగం... హృదయాలకు హత్తుకున్న ప్రజలు!
‘నేను ముస్లింను. నేను టెర్రరిస్టును కాదని నమ్మేవారు.. నన్ను ఆలింగనం చేసుకోండి’ అంటూ కళ్లకు గంతలు కట్టుకున్న పద్దెనిమిది సంవత్సరాల ముస్లిం యువతి ముదా అదాన్ కోరింది. ఈ వాక్యాలు రాసి ఉన్న ఒక ప్ల కార్డును తన పక్కన పెట్టుకుని సెంట్రల్ లండన్ లో రోడ్డుపై నిలబడింది. పలు దేశాల్లో ఇటీవల జరిగిన ‘ఉగ్ర’ సంఘటనల నేపథ్యంలో యాంటీ-ముస్లిం సెంటిమెంట్ పెరిగిపోయిందన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మునా అదన్ ఒక ‘సోషల్ ఎక్స్ పర్ మెంట్’ చేసింది. ఆ ముస్లిం యువతిని, ప్ల కార్డును చూసిన చాలా మంది ప్రజలు బాగానే స్పందించారు. చిన్న, పెద్ద అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఆమెను ‘హగ్’ చేసుకున్నారు.. ఆమె నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఉగ్రవాదంపైనే తమ పోరు కానీ, ముస్లింలపై కాదన్న విషయాన్ని తమ ఆప్యాయతతో కూడిన ఆలింగానాల ద్వారా మునా అదన్ కు తెలియజేశారు.