: విజయవాడ వాసులపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
విజయవాడ వాసులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రిపబ్లిక్ డే వేడుకల అనంతరం ఆయన మాట్లాడుతూ, విజయవాడ వాసులు ప్రపంచమంతా వెళ్లి వ్యాపారాలు చేస్తుంటారు...కానీ సొంత ప్రాంతం విషయానికి వచ్చేసరికి సంకుచితంగా ఆలోచిస్తుంటారని అన్నారు. విజయవాడ ప్రజలు తాత్కాలిక ప్రయోజనాలను వెతుక్కోవద్దని ఆయన సూచించారు. చిన్న చిన్న స్వార్థాలు వదులుకోకపోతే శాశ్వతంగా నష్టపోతామని ఆయన స్పష్టం చేశారు. అద్దెలు భారీగా పెరిగాయని అధికారులు చెబుతున్నారని ఆయన తెలిపారు. తాత్కాలిక ప్రయోజనాలు ఆశించవద్దని ఆయన సూచించారు.