: అత్యవసరంగా వెనుదిరిగిన ఢిల్లీ-మిలాన్ విమానం!


క్యాబిన్ లో ఒక్కసారిగా పొగలు రావడంతో ఢిల్లీ - మిలాన్ విమానం వెనుదిరగాల్సి వచ్చింది. ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి ఇటలీలోని మిలాన్ కు ఎయిర్ ఇండియా విమానం బయలుదేరిన కొద్దిసేపటికి క్యాబిన్ లో పొగలు వ్యాపించాయి. పైలట్ వెంటనే ఈ సమాచారాన్ని ఎయిర్ ట్రాఫిక్ సిబ్బందికి తెలియజేశాడు. దీంతో విమానం వెనుదిరిగింది. ఈ సంఘటనలో ప్రయాణికులకెవరికైనా ప్రమాదం జరిగిందా? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, ఈ ప్రమాద సంఘటనపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ బస్సీ కూడా ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News