: గణతంత్ర వేడుకల్లో.. ఈ ఐదూ ప్రత్యేకం !
న్యూఢిల్లీలోని రాజ్ పథ్ లో 67వ భారత గణతంత్ర వేడుకలు ఈ రోజు ఘనంగా జరిగాయి. పలు రాష్ట్రాల శకటాలు, సైనిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గత రిపబ్లిక్ డే వేడుకలతో పోలిస్తే ఈ వేడుకలకు ఐదు ప్రత్యేకతలు ఉన్నాయి. అవి ఏమిటంటే... * భారత సైన్యంతో కలిసి ఫ్రాన్స్ 35వ ఇన్ ఫాంట్రీ రెజిమెంట్ కవాతు చేయడం * 26 సంవత్సరాల తర్వాత రిపబ్లిక్ డే పరేడ్ లో ఆర్మీ డాగ్ స్క్వాడ్ పాల్గొనడం * మాజీ సైనికుల పరేడ్ కు బదులుగా ఈ సారి వారికి సంబంధించిన శకటాన్ని ప్రదర్శించడం * ఒకవేళ వర్షం కురిసినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకుగాను వీవీఐపీలు కూర్చున్న ప్రాంతంలో మోటారైజ్డ్ స్లైడింగ్ గ్లాసు రూఫ్ ఏర్పాటు చేయడం * సాహస బాలల అవార్డులు సాధించిన వారితో పరేడ్ చేయించడం వంటివి ప్రత్యేకతలుగా చెప్పవచ్చు.