: ఆసీస్ బ్యాటింగ్ షురూ


ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. భారత జట్టు నిర్దేశించిన 189 పరుగుల విజయ లక్ష్యం ఛేదించేందుకు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ క్రీజులోకి వచ్చారు. కాగా, ఆసీస్ బ్యాట్స్ మన్ జోరుకు అడ్డుకట్ట వేసేందుకు టీమిండియా చివరి వన్డేలో రాణించిన పేసర్ బుమ్రాతో పాటు ఆశిష్ నెహ్రాను బరిలోకి దించింది. వారికి తోడుగా ఈ మధ్య కాలంలో విశేషంగా రాణిస్తున్న భారత స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఆడుతున్నారు. అవసరం మేరకు ఆదుకునేందుకు యువరాజ్ సింగ్, సురేష్ రైనా అందుబాటులో ఉన్నారు. వీరంతా కలిసి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ కు అడ్డుకట్ట వేస్తారని సగటు అభిమాని ఆశిస్తున్నాడు. కాగా, విజయం సాధించాలంటే ఆస్ట్రేలియా జట్టు ఓవర్ కు 9.40 పరుగులు చొప్పున సాధించాల్సి ఉంది. కాగా, తొలి బంతినే బౌండరీగా మలిచి ఫించ్ ఆసీస్ దూకుడును చూపించాడు.

  • Loading...

More Telugu News