: జూలు విదిల్చిన రైనా, కోహ్లీ...టీమిండియా 188
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టీట్వంటీ ఆసక్తికరంగా సాగుతోంది. టీమిండియా ఓపెనర్లు... రోహిత్ శర్మ (31) ధాటిగా ఆడే క్రమంలో షేన్ వాట్సన్ వేసిన బంతికి మిడాన్ లో క్యాచ్ ఇచ్చి నిష్క్రమించగా, రోహిత్ అవుట్ కాగానే భారీ షాట్లకు యత్నించిన శిఖర్ ధావన్ (5)ను వాట్సన్ పెవిలియిన్ బాటపట్టించాడు. తరువాత క్రీజులోకి దిగిన విరాట్ కోహ్లీ (90), సురేష్ రైనా దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఆచి తూచి ఆడిన వీరిద్దరూ సందర్భోచితంగా భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, సురేష్ రైనాను జేమ్స్ ఫల్కనర్ బోల్తా కొట్టించాడు. దీంతో 175 పరుగుల వద్ద మూడో వికెట్ గా సురేష్ రైనా (41) వెనుదిరిగాడు. అనంతరం కెప్టెన్ ధోనీ (11) వస్తూనే సిక్సర్ తో తన ఉద్దేశ్యమేమిటో ఆసీస్ బౌలర్ కు చెప్పాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన భారత జట్టు 188 పరుగులు చేసింది.