: ఇది నిజం... ఏపీ, తెలంగాణ కాదు... కర్ణాటక ప్రతిపాదిస్తే రాజమౌళికి పద్మశ్రీ!
తనకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల రాజమౌళి మిశ్రమ స్పందన వెలిబుచ్చారు. ఈ ఉదయం 12 గంటల తరువాత ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పలు ట్వీట్లు పోస్ట్ చేశారు. ఈ సంవత్సరం కర్ణాటక ప్రతిపాదిస్తే తనకు పద్మశ్రీ వచ్చిందని తెలుసుకుని ఆశ్చర్యపోయినట్టు తెలిపాడు. అయితే, తనకు గత సంవత్సరమే ఏపీ ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు ప్రతిపాదిస్తున్నట్టు తెలిపిందని వెల్లడించిన ఆయన, అప్పుడు అవార్డు రాలేదన్నాడు. తాను కర్ణాటకలో పుట్టానని, ఏపీలో చదువుకున్నానని, తమిళనాడుకు పనిచేశానని, ఇప్పుడు తెలంగాణలో స్థిరపడ్డానని వెల్లడించాడు. అన్ని రాష్ట్రాల కుమారుడిగా తాను సంతోషిస్తున్నానని వివరించాడు. కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కాకుండా కర్ణాటక రికమండ్ చేస్తే రాజమౌళికి పద్మశ్రీ లభించిందన్న నిజాన్ని తెలుసుకున్న అభిమానులు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై విరుచుకుపడుతున్నారు.