: రాజమండ్రి జైలు నుంచి 124 మంది విడుదల... అందరికీ ఇళ్లు, ఉపాధి
గణతంత్ర దినోత్సవం సందర్భంగా దీర్ఘకాలంగా జైళ్లలో మగ్గుతూ సత్ప్రవర్తనతో ఉన్న ఖైదీలకు ఆంధ్రప్రదేశ్ సర్కారు విముక్తిని ప్రసాదించింది. మొత్తం 400 మంది ఖైదీలను నేడు విడుదల చేస్తున్నామని జైళ్ల శాఖ డీఐజీ ప్రకటించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అత్యధికంగా 124 మందిని విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న 276 మంది కూడా విడుదలౌతున్నట్టు తెలిపారు. వీరందరికీ వివిధ కేంద్ర, రాష్ట్ర పథకాల కింద ఇళ్లు కేటాయిస్తామని, జీవనోపాధికి రుణాలిచ్చి ప్రోత్సహిస్తామని వెల్లడించారు.