: ఉత్తమ నటుడు మహేశ్ బాబు, ఉత్తమ నటి శ్రుతిహాసన్


హైదరాబాద్ లో వైభవంగా జరిగిన ఐఫా అవార్డుల్లో రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి, మహేశ్ బాబు నటించిన శ్రీమంతుడు చిత్రాలు సత్తా చాటాయి. ఉత్తమ చిత్రంగా బాహుబలి నిలువగా, దాన్ని రూపొందించిన రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా అవార్డును అందుకున్నారు. ఇక మహేశ్ బాబు శ్రీమంతుడు చిత్రానికిగాను ఉత్తమ నటుడి పురస్కారాన్ని పొందగా, అదే చిత్రంలో హీరోయిన్ గా నటించిన శ్రుతిహాసన్ కు ఉత్తమ నటి అవార్డు లభించింది. ఇక ఉత్తమ సహాయ నటుడి అవార్డును శ్రీమంతుడు చిత్రానికి గాను జగపతి బాబు పొందగా, బాహుబలిలో నటించిన రమ్యకృష్ణకు ఉత్తమ సహాయ నటి అవార్డు లభించింది. ఉత్తమ కమెడియన్ గా 'భలే భలే మగాడివోయ్' చిత్రానికి గాను వెన్నెల కిషోర్ కు, ఉత్తమ విలన్ అవార్డు బాహుబలిలో దగ్గుబాటి రానాకు లభించాయి. ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ కు, ఉత్తమ పాటల రచయితగా రామజోగయ్య శాస్త్రికి, ఉత్తమ గాయకుడిగా సాగర్ కు (ఈ మూడూ శ్రీమంతుడు చిత్రానికే) లభించగా, ఉత్తమ నేపథ్యగాయనిగా బాహుబలిలో పాడిన సత్యా యామినికి లభించింది.

  • Loading...

More Telugu News