: ఢిల్లీ గగన తలంపై ఆంక్షలు... 10.35 గంటల నుంచి 12.15 గంటల వరకు విమానాలు ఎగరవు
భారత 67వ గణతంత్ర వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. వేడుకలకు ముందు ఇండియా గేట్ సమీపంలోని అమర్ జవాన్ జ్యోతి వద్ద ప్రధాని నరేంద్ర మోదీ దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులకు నివాళి అర్పించారు. మరికాసేపట్లో రాజ్ పథ్ లో వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ హాజరుకానున్నారు. వేడుకలపై విరుచుకుపడతామని ఐఎస్ ఉగ్రవాదులు ప్రకటించిన నేపథ్యంలో ఢిల్లీలో భద్రత మునుపెన్నడూ లేనంతగా పెరిగింది. వేడుకలు జరగనున్న 10.35 గంటల నుంచి 12.15 గంటల మధ్య ఢిల్లీ గగన తలంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ సమయంలో ఢిల్లీ గగన తలంపై ఒక్క విమానం కూడా ఎగరదు. ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులో విమానాల రాకపోకలు నిలిచిపోనున్నాయి.