: తాలిబన్ చీఫ్ ఫజ్లుల్లా హతం... పాక్ మీడియాలో కథనాలు


దాయాది దేశం పాకిస్థాన్ లో కల్లోలం సృష్టిస్తున్న తెహ్రీక్-ఈ- తాలిబాన్ (తాలిబన్) చీఫ్ ముల్లా ఫజ్లుల్లా హతమయ్యాడు. అఫ్ఘనిస్థాన్ కు చెందిన నంగార్ గఢ్ లోని ఫజ్లుల్లా ఇంటిపై అమెరికా డ్రోన్ల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో ఫజ్లుల్లా చనిపోయాడు. ఈ మేరకు పాకిస్థాన్ మీడియాలో నిన్న రాత్రి వరుస కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలకు సంబంధించి మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే, గతంలోనూ అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఫజ్లుల్లా చనిపోయాడని వార్తలు వచ్చాయి. పాక్ లోని ఖైబర్ ఏజెన్సీపై అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో పెద్ద సంఖ్యలో తాలిబన్ మిలిటెంట్లతో పాటు ఫజ్లుల్లా కూడా చనిపోయాడని గతేడాది మార్చిలో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను తాలిబన్లు కొట్టిపారేశారు. ఫజ్లులా చనిపోలేదని, ఇంకా బతికే ఉన్నాడని ఆ సంస్థ నాడు ప్రకటించింది.

  • Loading...

More Telugu News