: ఇక ‘పొట్టి’ పోరు!... భారత్, ఆసీస్ తొలి టీ20 నేడే
ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా ఐదు వన్డేల సిరీస్ లో నాలుగు వన్డేల్లో వరుసగా ఓటమిపాలైంది. సిరీస్ ను ఆతిథ్య దేశం ఆస్ట్రేలియాకు అప్పగించేసింది. చివరి వన్డేలో కొత్త కుర్రాడు మనీష్ పాండే పుణ్యమా అని ఘన విజయం సాధించింది. ఇక నేటి నుంచి ఆసీస్ తో ‘పొట్టి’ పోరుకు భారత్ సమాయత్తమైంది. ఆస్ట్రేలియా నగరం ఆడిలైడ్ లో నేటి మధ్యాహ్నం 2 గంటలకు తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. మొత్తం మూడు టీ20 మ్యాచ్ లు ఆడనున్న భారత్, ‘పొట్టి’ కప్ నైనా ఎగరేసుకువెళ్లాలని ఉవ్విళ్లూరుతోంది. వన్డే సిరీస్ చివరి మ్యాచ్ లో ఘన విజయం టీమిండియాలో కాస్తంత కొత్త ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి.