: దేశ పాలనలో మార్పులకు ప్రయత్నించే నా వారసులను కాల్చేయండి: ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు
‘దేశ పాలనలో మార్పులకు ప్రయత్నించే నా వారసులను కాల్చేయండి’ అని ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ నాడు పేర్కొన్నట్లు రా జాంగ్ యిల్ అనే దక్షిణ కొరియా మాజీ నిఘా చీఫ్ ఆర్మీ అధికారి రాసిన ఒక పుస్తకంలో తెలిపారు. కిమ్ ఇల్ సంగ్ తన అనుచరులకు, తనకు నమ్మకమైన అధికారులకు ఈ మేరకు నాడు ఆదేశాలిచ్చినట్లు ఆ అధికారి పేర్కొన్నారు. కేవలం ఆదేశాలివ్వడమే కాకుండా, వెండితో తయారు చేసిన తుపాకులను కూడా వారికి ఇచ్చారట. తన మరణానంతరం దేశ పాలన విషయాల్లో మార్పులు చేసేందుకు ప్రయత్నించే తన వారసులకు ఈ శిక్ష విధించాలని చెప్పాడట. సోవియట్ యూనియన్ పలు సంస్కరణలు చేసి ఎంతో పతనమైందని.. ఇదంతా తాను స్వయంగా చూశానని.. అందుకే తమ దేశంలో అటువంటి సంస్కరణలు చేపట్టకూడదని ఆయన కోరుకున్నట్లు ఆ పుస్తకంలో రాశారు.