: ‘వంగవీటి’ సినిమాపై మాతో ఎవరూ మాట్లాడలేదు: వంగవీటి రాధా


వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించనున్న ‘వంగవీటి’ సినిమాపై తమతో ఎవరూ మాట్లాడలేదని, చర్చించలేదని వంగవీటి రంగా కుమారుడు రాధాకృష్ణ అన్నారు. ఒక టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ సినిమా తీస్తున్నట్లు తమకెవ్వరూ చెప్పలేదని.. రంగా జీవితం, ఆయన జీవిత విశేషాలకు సంబంధించిన సమాచారం తమనెవ్వరూ అడగలేదని చెప్పారు. రంగా జీవిత కథను వక్రీకరించకుండా సినిమా తీస్తే ఫర్వాలేదని, లేకపోతే రంగా అభిమానులే సమాధానం చెబుతారని వంగవీటి రాధాకృష్ణ పరోక్షంగా దర్శకుడు రాంగోపాల్ వర్మను హెచ్చరించారు.

  • Loading...

More Telugu News