: ఢిల్లీ మెట్రోలో మోదీ, హోలాండె ప్రయాణం
భారత్ పర్యటనలో ఉన్న ప్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ఇవాళ ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఆయనతో పాటు ప్రధాని నరేంద్రమోదీ కూడా మెట్రో రైడ్ చేశారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని గుర్గావ్ వరకు ప్రయాణించి మెట్రో రైడ్ ను ఆస్వాదించారు. అంతర్జాతీయ సౌర అలయన్స్ (ఐఎస్ఏ) తాత్కాలిక సచివాలయం ప్రారంభోత్సవానికి వారు గుర్గావ్ వెళ్లారు. వారితో పాటు పలువురు అధికారులు కూడా ఉన్నారు. మెట్రో ప్రయాణానికి సంబంధించిన ఫోటోలను 'పీఎంవో ఇండియా' ట్విట్టర్ లో పోస్టు చేసింది.