: రామోజీకి పద్మవిభూషణ్ పై చంద్రబాబు స్పందన
పత్రికా రంగానికి అపార సేవలందించినందుకు గానూ రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు బాబు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు పత్రికా రంగాన్ని రామోజీ ప్రపంచస్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. పత్రికారంగం, ఎలక్ట్రానిక్ మీడియాలో ఆయన చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. వివిధ రంగాలకు విశేష సేవలు చేసిన పలువురు ప్రముఖులకు కేంద్రం ఇవాళ పద్మ పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే.