: భారత్-ఫ్రాన్స్ మధ్య కీలక ఒప్పందాలు... 13 అంశాలపై మోదీ, హోలాండె సంతకాలు
భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని నరేంద్రమోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండెలు 13 ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అందులో అంతరిక్ష సహకారం, టెక్నాలజీ, అంబాలా, లూథియానా రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ, ఫుడ్ సేఫ్టీ, స్మార్ట్ గవర్నెన్స్ వంటి అంశాలున్నాయి. దాంతో పాటు అతి ముఖ్యమైన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు లైన్ క్లియర్ అయింది. 36 విమానాలు కొనుగోలు చేసేందుకు భారత్ సుముఖత తెలిపింది. దానికి సంబంధించిన ఒప్పందంపై కూడా ఇరు దేశాలు సంతకం చేశాయి. దానిపై ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.