: ఎల్లుండి జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ అవుతున్న మంత్రి కామినేని
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గతవారం మోకాలి చిప్ప ఆపరేషన్ చేయించుకున్న ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఎల్లుండి డిశ్చార్జ్ కానున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో మీడియాతో ఆయన మాట్లాడారు. జీజీహెచ్ తో పాటు విశాఖ, కర్నూలు ఆసుపత్రులలోనూ మోకాలి ఆపరేషన్ చేయించుకునే సదుపాయం కల్పిస్తామని తెలిపారు. అంతేగాక జీజీహెచ్ లో పడకల సంఖ్య పెంచబోతున్నట్టు వెల్లడించారు. జీజీహెచ్ లో తనకు జరిగినట్టే ప్రతీ ఒక్కరికీ వైద్యం జరగాలని ఆకాంక్షిస్తున్నానని కామినేని పేర్కొన్నారు.