: రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితిపై రాహుల్ ఆరా!... 5న పీసీసీ చీఫ్ లతో ప్రత్యేక భేటీ


గడచిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో తలబొప్పి కట్టిన కాంగ్రెస్ పార్టీ... ఏపీలో తుడిచిపెట్టుకుపోగా, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో గడ్డు పరిస్థితి ఎదుర్కుంటోంది. హర్యానా, ఢిల్లీ రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లోనూ ఆ పార్టీకి పరాభవం తప్పలేదు. ఇటీవలే ముగిసిన బీహార్ ఎన్నికల్లో మాత్రం జేడీయూ, ఆర్జేడీలతో జట్టు కట్టి కాస్తంత మెరుగైన ఫలితాలను రాబట్టుకుంది. తాజాగా వచ్చే ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్ లలోనూ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దృష్టి సారించారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు సాగిస్తున్న ఆయన వచ్చే నెల 5న అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లతో ప్రత్యేకంగ భేటీ కానున్నారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లో పార్టీ స్థితిగతులపై సమగ్ర నివేదకలతో సమావేశానికి రావాలని పీసీసీ చీఫ్ లకు లేఖలు వెళ్లాయి.

  • Loading...

More Telugu News