: కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు గుండెపోటు... అపోలో ఐసీయూలో చికిత్స
నిన్నటిదాకా సికింద్రాబాదులో టీడీపీకి కీలక నేతగానే కాక, ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉండి ఇటీవలే టీఆర్ఎస్ లో చేరిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కొద్దిసేపటి క్రితం గుండెపోటుకు గురయ్యారు. తక్షణమే స్పందించిన ఆయన కుటుంబ సభ్యులు ఆయనను హైదర్ గూడలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అపోలో ఐసీయూలో చికిత్స జరుగుతోంది. గ్రేటర్ ఎన్నికల ప్రచారం ఉవ్వెత్తున సాగుతున్న తరుణంలో సాయన్న గుండెపోటుకు గురి కావడం టీఆర్ఎస్ వర్గాలను షాక్ కు గురి చేసింది.