: విశాఖ జిల్లాలోని దక్కన్ కెమికల్స్ పై గ్రామస్థుల రాళ్ల దాడి


విశాఖ జిల్లా పాయకరావు పేట మండలం, కేశవరం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక్కడి దక్కన్ కెమికల్స్ పరిశ్రమలో నిన్న (ఆదివారం) చోటుచేసుకున్న ప్రమాదం పట్ల చుట్టుపక్కల గ్రామాలైన రాజవరం, గజపతినగరం గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమవల్ల తమకు ప్రమాదం ఉందంటూ పరిశ్రమ యాజమాన్యానికి వ్యతిరేకంగా గ్రామస్థులు నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పరిశ్రమపై వీరు రాళ్లదాడి చేయగా అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం అయ్యాయి. అక్కడికి వచ్చిన నర్సీపట్నం ఆర్డీవోను అడ్డుకుని వెనక్కి పంపించారు. ఈ క్రమంలో గ్రామస్థులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దాంతో పరిశ్రమ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో పోలీసులకు గాయాలయ్యాయని తెలిసింది. మరోవైపు దక్కన్ పరిశ్రమ ప్రధాన ద్వారాన్ని తోసుకుని ప్రజలు లోపలికెళ్లారు.

  • Loading...

More Telugu News