: ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న ప్రయాణికులు ... ఏడుగురికి గాయాలతో విమానం ఎమర్జన్సీ ల్యాండింగ్
అది మియామీ నుంచి మిలన్ ప్రయాణిస్తున్న అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానం. మార్గమధ్యంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం తీవ్ర కుదుపులకు లోను కాగా, ఏం జరుగుతుందో తెలియని 192 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చోవాల్సి వచ్చింది. ఈ విమానంలో కుదుపులకు సిబ్బంది సహా ఏడుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన పైలట్ విమానాన్ని ఈస్ట్ కోస్ట్ కెనడియన్ ప్రావిన్స్ ప్రాంతంలోని ఓ విమానాశ్రయంలో ఎమర్జన్సీ ల్యాండింగ్ చేశాడు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించామని, ఎవరికీ ప్రమాదం జరుగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటన తమను భయభ్రాంతులకు గురి చేసిందని ప్రయాణికులు తమ అనుభవాన్ని తెలిపారు.