: నా వెనుక నడిచి ఐఎస్ఐఎస్ లో చేరొద్దు: సోదరుడికి జీహాదీ జాన్ సలహా


మహమ్మద్ ఎమ్వాజీ... కరుడు గట్టిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాది. సిరియాలో బందీల కంఠాలను కూరగాయలు తరిగినట్టుగా నరికేసి, వాటిని ప్రపంచానికి చూపి భయాందోళనలకు గురిచేసిన ముష్కరుడు. గత సంవత్సరం సంకీర్ణదళాలు జరిపిన డ్రోన్ దాడిలో హతమైన ఎమ్వాజీ, తన 22 ఏళ్ల సోదరుడు ఒమర్ కు అమూల్యమైన సలహా ఇచ్చాడట. తన దారిలో నడిచి సిరియా లేదా ఇరాక్ కు రావాలన్న ఆలోచన కూడదని, ఉగ్రవాదిగా మారవద్దని మరణించే ముందు అతను చెప్పినట్టు ఒమర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇతరులు చేసే తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలని చెప్పాడని అన్నాడు. "నేను ఎక్కడున్నానో చూడు. పెళ్లి చేసుకోలేను. ఉద్యోగం చేయలేను. అసలెక్కడికీ కదల్లేను. నాలా నువ్వు ఉండవద్దు" అని సలహా ఇచ్చాడని ఒమర్ తెలిపాడు. తన సోదరుడు తిరిగి కువైట్ వెళ్లాలని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడని పేర్కొన్నాడు. చివరికి 2012లో బ్రిటన్ నుంచి తప్పించుకుని పోర్ట్ ఆఫ్ డోవర్ మీదుగా టర్కీకి, ఆపై సిరియాకు వెళ్లాడని, అక్కడ అల్ ఖైదా ఫారిన్ ఫైటర్స్ విభాగంలో చేరిపోయాడని గుర్తు చేసుకున్నాడు.

  • Loading...

More Telugu News