: మాలిక్ నోరిప్పితే ముషార్రఫ్ కు మూడినట్టే!


పాకిస్థాన్ హోం శాఖ మాజీ మంత్రి రెహ్మాన్ మాలిక్ చెప్పే సాక్ష్యంపైనే ఆ దేశ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ భవితవ్యం ఆధారపడి ఉంది. పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్లో హత్య కేసుకు సంబంధించిన విచారణ తుది దశకు చేరుకుంది. బెనజీర్ హత్య కేసులో ముషార్రఫ్ ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. ఓ కేసులో కొంతకాలం పాటు విదేశాల్లో ఉండి పాక్ కు తిరిగివచ్చిన తర్వాత బెనజీర్ ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ముషార్రఫే బెనజీర్ ను హత్య చేయించారన్న ఆరోపణలు నాడు వెల్లువెత్తాయి. తాజాగా రావల్పిండి కేంద్రంగా జరుగుతున్న విచారణలో ఇప్పటికే అమెరికాకు చెందిన ఓ జర్నలిస్ట్ కీలక సాక్ష్యం చెప్పారు. అమెరికా నుంచే వీడియో కాన్ఫరెన్స్ లో సాక్ష్యమిచ్చిన సదరు జర్నలిస్టు... దేశంలో అడుగు పెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని బెనజీర్ ను ముషార్రఫ్ బెదిరించారు. అంతేకాక రాజకీయంగా తనతో నెరిపే సంబంధాలపైనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని కూడా ముషార్రఫ్, బెనజీర్ ను హెచ్చరించారు. ఈ బెదిరింపులు దుబాయి విమానాశ్రయంలో చోటుచేసుకున్నాయి. ఈ ఘటనకు రెహ్మాన్ మాలిక్ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు కూడా కోర్టు నుంచి సమన్లు అందాయి. మరి నాటి బెదిరింపులను రెహ్మాన్ మాలిక్ ధ్రువీకరిస్తే... ముషార్రఫ్ ను కోర్టు దోషిగా ప్రకటించడం ఖాయంగానే కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News