: మహాత్ముడి సమాధి వద్ద ఫ్రాన్స్ అధ్యక్షుడి నివాళులు
భారత్ లో పర్యటిస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండె జాతిపిత మహాత్ముడికి నివాళులర్పించారు. ఢిల్లీలోని గాంధీ సమాధి రాజ్ ఘాట్ వద్ద ఆయన మహాత్ముడి సమాధిపై జాతీయ జెండా రంగుల్లో ఉన్న పుష్పగుచ్ఛాన్ని ఉంచారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, పలువురు అధికారులు కూడా ఆయనకు నివాళులర్పించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా భారత్ కు వచ్చిన హోలాండె హైదరాబాద్ హౌజ్ లో ఇవాళ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ తో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. దానికంటే ముందు రాష్ట్రపతి భవన్ లో హోలాండె గౌరవ వందనం స్వీకరించనున్నారు.