: తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో సాంకేతిక లోపం... భువనగిరి వద్ద నిలిచిపోయిన వైనం


వేలాది మంది ప్రయాణికులతో నేటి ఉదయం హైదరాబాదు నుంచి దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ ఎక్స్ ప్రెస్ నల్లగొండ జిల్లా భువనగిరి సమీపంలో నిలిచిపోయింది. ఇంజిన్ లో ఏర్పడ్డ సాంకేతిక లోపంతో బయలుదేరిన కొద్దిసేపటికే తెలంగాణ ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం అందుకున్న రైల్వే ఇంజినీరింగ్ అధికారులు హుటాహుటిన అక్కడకు బయలుదేరారు. ఇంజిన్ లో నెలకొన్న సమస్యను పరిష్కరించిన తర్వాతే తెలంగాణ ఎక్స్ ప్రెస్ అక్కడి నుంచి బయలుదేరనుంది.

  • Loading...

More Telugu News