: అర్ధరాత్రి ఎన్ కౌంటర్... పోలీసుల అదుపులో ఒకరు


మరో 24 గంటల్లో రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు జరగనున్న వేళ, ఘజియాబాద్ లో పోలీసులు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరగడం కలకలం సృష్టించింది. ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్ వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన అనంతరం ఒకరిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. చెక్ పోస్టు వద్ద వాహనాలను తనిఖీలు చేస్తున్న వేళ, అక్కడికి వచ్చిన ఓ కారు నుంచి కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు. కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి దొంగతనం కేసులో నిందితుడు అంకిత్ అని, అతన్ని పట్టించిన వారికి రూ. 25 వేల రివార్డు కూడా ఉందని తెలుస్తోంది. కాగా, ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండే, ఇండియాలో పర్యటిస్తున్న వేళ రిపబ్లిక్ వేడుకలు సాఫీగా సాగాలన్న ఉద్దేశంతో, భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News